Hyderabad, జూన్ 12 -- తెలుగు చిత్ర పరిశ్రమల్లోని అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. దిల్ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారిన దిల్ రాజు మళ్లీ నితిన్‌తో నిర్మించిన మూవీ తమ్ముడు. జూన్ 11న తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలకృష్ణ ముద్దుల మావయ్య మూవీతో తమ్ముడుని పోల్చడం, నితిన్ రెమ్యునరేషన్‌పై మాట్లాడారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. "మా సంస్థలో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేద్దామా అని ఎదురుచూశాం. ఈ సినిమా కోసం డైరెక్టర్ శ్రీరామ్ వేణు నాలుగేళ్లు కష్టపడ్డాడు. ఈ కథ అనుకున్నప్పుడే విజువల్, సౌండింగ్ కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తానని శ్రీరామ్ చెప్పాడు. అన్నట్లుగానే చాలా కష్టపడి చేశాడు" అని అన్నారు.

"ఈ సినిమా ముద్దుల మావయ్య (బాలకృష్ణ మూవీ)లా ఉం...