భారతదేశం, అక్టోబర్ 5 -- కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్: రిషబ్ శెట్టి తన స్వీయ దర్శకత్వంలో నటించిన కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లో దేశీయంగా భారీ వసూళ్లు రాబట్టిన కాంతారా చాప్టర్ 1 ఆదివారం కలెక్షన్లు, ఆక్యుపెన్సీని పెంచుకుని భారీ వీకెండ్ వసూళ్లకు సిద్ధమైంది. ఇప్పటికే ఇండియాలోనే రూ.200 కోట్ల కలెక్షన్లను దాటింది ఈ సినిమా.

కాంతారా చాప్టర్ 1 ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి మూడు రోజుల్లో రూ.162.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. శనివారం ఈ చిత్రం దేశీయంగా సుమారు రూ.55 కోట్ల నికర కలెక్షన్లు రాబట్టింది. ఇది శుక్రవారం వచ్చిన రూ.46 కోట్ల కంటే 20% ఎక్కువ. ఆదివారం (అక్టోబర్ 5) ఉదయం ఆటలతో ప్రారంభించి వసూళ్ల వేగం పెరిగింది. సక్నిల్క్ ప్రకారం ఈ చిత్రం ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు రూ.41.8 కోట్ల నికర ...