Hyderabad, అక్టోబర్ 5 -- కాంతారా చాప్టర్ 1 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్: రిషబ్ శెట్టి హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన మరో సినిమా కాంతార చాప్టర్ 1. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన కాంతార 2 బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

దసరా రోజున బంపర్ ఓపెనింగ్ తరువాత రెండో రోజు మందగించిన కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్ మూడో రోజు పెరిగాయి. ముూడో రోజున అంటే శనివారం (అక్టోబర్ 4) నాడు ఇండియాలో కాంతార చాప్టర్ 1 సినిమాకు రూ. 55 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పాయి.

అంటే, రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు సుమారుగా 15 శాతం వరకు కలెక్షన్స్ పెరిగాయి. అలాగే, మూడు రోజుల్లో ఇండియాలో కాంతార 2 సినిమాకు రూ. 162.85 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అలాగే, రూ. 195.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.

ఆదివారం కలెక్షన్స్...