భారతదేశం, సెప్టెంబర్ 26 -- ఓజీ బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 1: పవన్ కల్యాణ్ తన రీసెంట్ రిలీజ్ 'దే కాల్ హిమ్ ఓజీ'తో బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాడు. తెలుగు సినిమాల్లోకి ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ ఇచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలుస్తోందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గురువారం (సెప్టెంబర్ 25) థియేటర్లలో రిలీజైన మూవీ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. 2025లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూవీగా నిలిచింది.

పవన్ కల్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన ఓజీ చిత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు దాటింది. ఫస్ట్ డేనే అనేక రికార్డులను బద్దలు కొట్టుతుందని భావిస్తున్నారు. ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం ఓజీ ఫస్ట్ డే (గురువారం) రాత్రి 10 గంటల వరకు ఇండియాల...