Hyderabad, ఆగస్టు 21 -- ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతుండటం ఇటీవల చాలా సాధారణంగా మారింది. ఈ క్రమంలోనే తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన రొమాంటిక్ కామెడీ చిత్రం బన్ బటర్ జామ్ తెలుగులో థియేట్రికల్ రిలీజ్ కానుంది.

రాజు జెయమోహన్ హీరోగా ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరోయిన్లుగా నటించిన బన్ బటర్ జామ్ సినిమాకు రాఘవ్ మిర్‌దత్ దర్శకత్వం వహించారు. రెయిన్ ఆఫ్ ఎరోస్, సురేష్ సుబ్రమణియన్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో శ్రీ విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సీహెచ్ సతీష్ కుమార్ విడుదల చేస్తున్నారు.

అయితే, ఆగస్ట్ 22న థియేటర్లలో విడుదల కానున్న బన్ బటర్ జామ్ ప్రీమియర్ షోలు రెండు రోజుల ముందుగానే పడ్డాయి. మరి ఈ సినిమా మెప్పించిందా లేదా అనేది నేటి బన్ బటర్ జామ్ రివ్యూలో తెలుసుకుందాం.

మధుమిత (ఆధ్య ప్రసాద్) చంద్రు (రాజు జెయమోహన్) ఇద్...