భారతదేశం, అక్టోబర్ 11 -- తెలంగాణ సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రత్యేకంగా నిలిచే బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి, దాని చుట్టూ మహిళలు పాటలు పాడుతూ, పండుగను వైభవంగా జరుపుతారు. అయితే, బతుకమ్మ పండుగ సమయంలో గౌరమ్మను పూజిస్తారు. అయితే, ఎందుకు బతుకమ్మలో గౌరమ్మను పూజిస్తారు? ఈ కథ మీకు తెలుసా?

పూలతో అమ్మవారిని ఆరాధిస్తారు. బతుకమ్మలో గౌరమ్మను పూజిస్తారు. పూలతో అమ్మవారిని ఆరాధించడం వెనుక ఆధ్యాత్మిక భావం ఉంది. ఆ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం చూసినట్లయితే, పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడం కోసం కఠోర తపస్సు చేసింది. ఆమె భక్తి, పట్టుదల, నిష్ఠకు మెచ్చిన శివుడు ఆమెను అర్ధాంగిగా స్వీకరించడం జరిగింది.

గౌరీదేవిని ఆరాధిస్తే భక్తులు దాంపత్య సౌఖ్యం, కుటుంబ శ్రేయస్సు, మానసిక ధైర్యం పొంద...