భారతదేశం, జూలై 28 -- ఈ నెల ప్రారంభంలో రెనాల్ట్​ తమ ట్రైబర్ మోడల్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. రెనాల్ట్​ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ అనేక డిజైన్ మార్పులతో పాటు, సరికొత్త ఫీచర్లతో వచ్చింది. ఇండియాలో అఫార్డిబుల్​ ఫ్యామిలీ ఎంపీవీగా ఇది మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్వీడ్ హ్యాచ్‌బ్యాక్, కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పాటు ప్రస్తుతం ట్రైబర్ ఎంపీవీని విక్రయిస్తున్న ఫ్రెంచ్ ఆటోమేకర్.. మారుతీ సుజుకీ ఎర్టిగా, కియా క్యారెన్స్‌లతో పోటీపడేలా రెనాల్ట్​ ట్రైబర్‌ను రీడిజైన్ చేసింది.

భారతీయ ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో యుటిలిటీ వాహన విభాగానికి వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఎస్‌యూవీలు, క్రాసోవర్‌ల ప్రజాదరణ దీనికి ప్రధాన కారణం. అయితే, ఎంపీవీలు కూడా విశాలమైన, కుటుంబ అవసరాలకు సరిపోయే ఆచరణాత్మకమైన ఎంపికలుగా డిమాండ్‌ను పెంచుకుంటున్నాయి. దీనికి అనుగుణంగా,...