Hyderabad, సెప్టెంబర్ 19 -- చాలా మంది చేతి వేళ్లకు బంగారు ఉంగరాలను ధరిస్తారు. బంగారు ఉంగరాలు అందానికే కాదు, అనేక విధాలుగా మనకి అదృష్టాన్ని కలిసి వచ్చేలా చేస్తాయి. పైగా బంగారం సంపద, సానుకూల శక్తి, శుభానికి చిహ్నం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వాస్తు శాస్త్రం ప్రకారం చేతికి బంగారు ఉంగరాన్ని పెట్టుకున్న వారు కొన్ని నియమాలని పాటించాలి. సరైన వేలికి సరిగ్గా ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి, సక్సెస్‌ని అందుకోవచ్చు, ఆరోగ్యం బాగుంటుంది, సంపద పెరుగుతుంది, అదృష్టం కూడా తలుపు తడుతుంది.

ఉంగరం వేలికి బంగారు ఉంగరాన్ని ధరించడం వలన చాలా లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అదే విధంగా పిల్లలు కలగాలనుకునే భార్యా భర్తలకు కూడా బాగా కలిసి వస్తుంది.

చూపుడు వేలుకు బంగారు ఉంగరాన్ని ధరించడం వలన కెరీర్‌లో బాగా కలిసి వస్తుంది. అనుకున్న వాటిని నెరవేర్చడానికి...