భారతదేశం, సెప్టెంబర్ 23 -- స్కోడా ఆటో ఇండియా తన ఫ్లాగ్‌షిప్ ఎస్​యూవీ అయిన కొడియాక్ లైనప్‌ను విస్తరించింది. ఈ మేరకు సరికొత్త ఎంట్రీ-లెవెల్ వేరియంట్ 'కొడియాక్ లౌంజ్'ను విడుదల చేసింది. దీని ధర రూ. 39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త వేరియంట్ ఐదు సీట్ల కాన్ఫిగరేషన్, ప్రత్యేకమైన డిజైన్, ప్రీమియం వేరియంట్‌ల కన్నా తక్కువ ఫీచర్లతో వస్తుంది.

కొడియాక్ లౌంజ్ అనేది కొత్తగా వచ్చిన బేస్ వేరియంట్. ఇది స్పోర్ట్‌లైన్, లారిన్- క్లెమెంట్ (ఎల్​ అండ్​ కే) వేరియంట్‌ల కన్నా తక్కువ ధరలో లభిస్తుంది. సాధారణంగా ఉండే ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌కు భిన్నంగా, ఇందులో ఐదు సీట్లు మాత్రమే ఉన్నాయి. దీనితో బూట్ స్పేస్ భారీగా పెరిగింది. ఏడు సీట్ల మోడల్‌లో 281 లీటర్ల బూట్ స్పేస్ ఉండగా, ఇందులో 786 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది! ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్.

బాహ్యంగా చూస్తే, కొడి...