భారతదేశం, జూలై 15 -- భారతీయ కస్టమర్ల కోసం కొత్త 7 సీటర్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ కారు అందుబాటులోకి వచ్చింది! కియా క్యారెన్స్​ క్లావిస్​ ఈవీని సంస్థ భారత దేశంలో తాజాగా లాంచ్​ చేసింది. ఈ కియా క్యారెన్స్​ క్లావిస్ ఈవీ ధరలు రూ. 17.99 లక్షల నుంచి ప్రారంభమై, రూ. 24.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ ఎంపీవీ రేంజ్​, ఫీచర్లు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

క్యారెన్స్​ క్లావిస్ ఈవీలోని ఎలక్ట్రిక్​ మోటార్.. 169 బీహెచ్​పీ పవర్​ని 255 ఎన్​ఎం పీక్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇది 8.4 సెకన్లలో 0 నుంచి 100 కేఎంపీహెచ్​ వేగాన్ని అందుకుంటుంది. 51.4 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్ నుంచి శక్తిని పొందే ఈ మోడల్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 490 కి.మీ.ల రేంజ్‌ను అందిస్తుందని సంస్థ వెల్లడించింది. చిన్న 42 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్ కూడా ...