భారతదేశం, జనవరి 30 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్ లోని ఇంటి చిరునామాలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు నంది నగర్‌ నివాసంలో ఇంటి గోడకు సిట్ నోటీసులు అతికించారు.

ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ స్పష్టం చేసింది. సీఆర్పీసీ 160 కింది నోటీసులు అందజేసింది. మరోసారి కేసీఆర్ కు నోటీసులు జారీ అవ్వటం కీలక పరిణామంగా మారింది.

నిజానికి కేసీఆర్ విచారణకు సంబంధించి ఇటీవలనే సీట్ నోటీసులు జారీ అయ్యాయి. జనవరి 30వ తేదీన విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ విచారణకు హాజరు కాలేను అని కేసీఆర్ బదులిచ్చారు. విచారణను రీషెడ్యూల్ చేయాలని కోరారు. మున్సిపల్‌ ఎన్నికలు ఉన్నందున సమయం ఇవ్వాలని కోరారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని. విచ...