భారతదేశం, జూన్ 16 -- ఇంటి నిర్మాణం, అలంకరణలో వాస్తుతో పాటు ఫెంగ్ షుయీ నిబంధనలకు ప్రాధాన్యత పెరిగింది. ప్రధాన ద్వారం నుంచి వంటగదిలోని స్టవ్ కనిపిస్తే ఆర్థిక సమస్యలు తప్పవని ఫెంగ్ షుయీ చెబుతోంది. దీన్ని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో ఇల్లు కొన్నా, కట్టినా వాస్తు శాస్త్రంతో పాటు చైనీస్ వాస్తు విధానమైన 'ఫెంగ్ షుయీ'ని కూడా ఎంతో మంది పాటిస్తున్నారు. ఇంట్లోని ప్రతి మూలకూ ఒక శక్తి ఉంటుంది. అయితే, ఫెంగ్ షుయీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం (Main Door) నుంచి నేరుగా వంటగదిలోని పొయ్యి (Kitchen Stove) కనిపిస్తుంటే, అది తీవ్రమైన వాస్తు దోషంగా పరిగణించబడుతుంది. దీని వల్ల ఇంట్లోని సానుకూల శక్తి (Positive Energy) బయటకు వెళ్లిపోవడమే కాకుండా, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్ముతారు.

ఫెంగ్ షుయీ శాస్త్రం ప్రకారం, వంటగ...