భారతదేశం, సెప్టెంబర్ 25 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు కాలర్ ఎగిరేసుకునేలా ఓజీ మూవీ అదరగొడుతోంది. పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఇవాళ (సెప్టెంబర్ 25) థియేటర్లలో రిలీజైన ఓజీ సినిమా వసూళ్లలో సత్తాచాటుతోంది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఇది.

భారీ అంచనాల మధ్య విడుదలైన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఓజీ సినిమాకు ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో అద్భుతమైన స్పందన లభించింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాపై ఉన్న హైప్‌తో సెప్టెంబర్ 25న ఉదయం 10:45 గంటల వరకు ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా రూ. 11.61 కోట్ల నెట్ వసూళ్లు సాధించిందని ఫిలిం ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ తెలిపింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినిమాలలో అత్యధిక ఓపెనింగ్ డే...