భారతదేశం, జూన్ 19 -- ఏపీలో ఇంధన రంగంలో పురోగతి సాధించేందుకు ప్రైవేట్‌ భాగస్వామ్యంతో లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు వివిధ దశల్లో సాగుతున్నాయి.ఏపీ జెన్‌కో పరిధిలోని సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ ద్వారా ప్రైవేట్‌ పెట్టుబడులతో ఈ ప్రాజెక్టుల్ని చేపడుతున్నారు. ప్రస్తుతం ఇంధన శాఖలో కీలక నిర్ణయాలన్నీ ఓ అధికారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. వీటిపై ఐఏఎస్‌ల పర్యవేక్షణ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

గత కొన్నేళ్లుగా ఏపీలో సోలార్‌, గ్రీన్‌ ఎనర్జీ, పంప్డ్‌ స్టోరేజీ వంటి పద్ధతుల్లో విద్యుతుత్పత్తి కోసం భారీ పెట్టుబడులతో ప్రాజెక్టుల్ని చేపట్టారు. భవిష్యత్‌లో ఏర్పడే విద్యుత్‌ డిమాండ్‌‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి సాధించడంతో పాటు గ్రిడ్‌ అవసరాలను తీర్చేలా భారీ ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. దాదాపు రూ.3లక్షల కో...