Hyderabad, ఆగస్టు 8 -- హారర్ థ్రిల్లర్ జానర్లో మరో వెబ్ సిరీస్ ఓటీటీలోకి వస్తోంది. ఈ అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ పేరు అంధేరా (Andhera). శుక్రవారం (ఆగస్టు 8) ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్ ఆగస్టు 14 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మరి ట్రైలర్ ఎలా ఉందో చూడండి.

ప్రైమ్ వీడియోలోకి వస్తున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంధేరా ట్రైలర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ 24 ఏళ్ల అమ్మాయి మిస్సింగ్ కేసు చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ కేసును ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ టేకప్ చేస్తుంది. మరోవైపు అదే సమయంలో తన పీడకలల్లో తాను ఎప్పుడూ చూడని అమ్మాయిని చూస్తూ ఉంటాడు జై అనే ఓ అబ్బాయి. ముంబై నగరంలోనూ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంటూ ఓ అమ్మాయి క్లబ్ నడిపిస్తూ ఉంటుంది.

వీటన్నింటి మధ్యా ఏదో లింకు ఉందని...