Hyderabad, జూలై 28 -- అమెజాన్ ప్రైమ్ వీడియో మెల్లగా తెలుగు కంటెంట్ పెంచుతోంది. ఒరిజినల్ తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. తాజాగా అరేబియా కడలి పేరుతో మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సత్యదేవ్ లాంటి టాలెంట్ యాక్టర్ తో తీసుకొస్తున్న ఈ సిరీస్ ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్, ఇతర వివరాలు ఇక్కడ చూడండి.

ప్రైమ్ వీడియో మరో తెలుగు వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ మధ్యే కీర్తి సురేష్ నటించిన 'ఉప్పు కప్పురంబు' విజయవంతం తర్వాత, అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. దీని పేరు 'అరేబియా కడలి'. ఈ సిరీస్ ఆగస్ట్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో ప్రముఖ తెలుగు నటులు సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

'అరేబియా కడలి' ప్రత్యేకత...