Hyderabad, సెప్టెంబర్ 12 -- ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని గడపాలని అనుకుంటారు. మన జీవితంలోకి మనల్ని అర్థం చేసుకొని, మనల్ని బాగా చూసుకునేవారు వస్తే ఇక జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండొచ్చు. మంచి జీవిత భాగస్వామి రావాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు.

మీరు ఇప్పటికే ప్రేమలో ఉన్నారా? కోరుకున్న వ్యక్తితో మీ పెళ్లి జరగాలని అనుకుంటున్నారా? అయితే ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లడానికి ఇలా పూజించడం మంచిది. ఇక మీకు తిరుగు లేకుండా కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరుగుతుంది.

రాధాకృష్ణులను బెడ్రూంలో పెట్టుకుంటే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని, వైవాహిక జీవితంలో ఇబ్బందులు అన్ని తొలగిపోయి ప్రేమ పెరుగుతుందని నమ్ముతారు. రాధాకృష్ణులు ప్రేమకు చిహ్నం. రాధాకృష్ణులను పూజించడం వలన వారి అనుగ్రహం కలిగి ప్రేమ జీవితం మ...