భారతదేశం, ఆగస్టు 26 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా పేరు మరోసారి ట్రెండ్ అవుతుంది. తాను ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేయడమే అందుకు కారణం. త్వరలో తమ జీవితాల్లోకి లిటిల్ యూనియర్స్ వస్తుందని పరిణీతి, ఆమె భర్త రాఘవ్ చద్దా సోమవారం (ఆగస్టు 25) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ సారి పరిణీతి చోప్రా నెట్ వర్త్ ఎంతో తెలుసుకుందాం.

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా నెట్ వర్త్ రూ.74 కోట్లు అని అంచనా. ఈ బ్యూటీకి అత్యంత ఖరీదైన బంగ్లా, లగ్జరీ కార్లున్నాయి. మూవీస్ లో యాక్టింగ్ తో పాటు బ్రాండ్ ప్రమోషన్లతోనూ ఈ ముద్దుగుమ్మ బాగానే సంపాదిస్తోంది. అందుకే ఆమె నెట్ వర్త్ రూ.74 కోట్లకు చేరింది.

పరిణీతి చోప్రాకు రూ.22 కోట్ల బంగ్లా ఉంది. ముంబయిలోని బాంద్రాలో ఈ విలాసవంతమైన బంగ్లా ఉంది. దీని విలువ రూ.22 కోట్లు అని అంచనా. అంతే కాకుండా లగ్జరీ కార్లున్నాయి...