భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ది రాజాసాబ్ మూవీపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇది రాజాసాబ్ కాదు డూప్ సాబ్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇందులో హీరోకు, హీరోయిన్ కు బాడీ డబుల్ వాడారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మాళవిక మోహనన్ రియాక్టయింది.

ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ది రాజాసాబ్ సినిమాలో మాళవిక మోహనన్ ఓ యాక్షన్ సీక్వెన్స్ లో నటించింది. హీరో నానమ్మను హింసించిన రౌడీలను మాళవిక చితక్కొడుతుంది. అయితే ఈ యాక్షన్ సీన్స్ మాళవిక చేయలేదని ఆమె డూప్ చేసిందనే ట్రోల్స్ వస్తున్నాయి. రాజాసాబ్ షూటింగ్ సమయంలోని మాళవిక డూప్ ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడమే కారణం.

రాజాసాబ్ సినిమాలో యాక్షన్ సీన్స్ మాళవిక చేయలేదని, బాడీ డబుల్ యూజ్ చేశారనే కామెంట్లు వస్తున్నాయి. వీటిపై ర...