భారతదేశం, జూలై 29 -- తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, దాని అనుబంధ ఆధ్యాత్మిక ప్రాంతాలు త్వరలోనే సరికొత్త శోభను సంతరించుకోనున్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'ప్రసాద్' (PRASHAD - Pilgrimage Rejuvenation and Spiritual Heritage Augmentation Drive) పథకం కింద భద్రాచలాన్ని అంతర్జాతీయ స్థాయి వసతులతో అభివృద్ధి చేస్తున్నారు. భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింత మెరుగుపరచేందుకు ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా జరుగుతోంది.

మొత్తం రూ.41.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 55 శాతానికి పైగా కీలక పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం శ్రీరామనవమి వేడుకలకు వేదికయ్యే ప్రసిద్ధ మిథిలా స్టేడియంపై షెడ్ నిర...