Hyderabad, జూలై 13 -- తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో మరణించారు. ఇవాళ ఆదివారం (జులై 13) తెల్లవారుజామున 4 గంటల సమయంలో కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచారు.

దీంతో తెలుగు సిని ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తెలుగు చిత్ర లోకం కోట మరణంతో దిగ్భ్రాంతికి గురైంది. ప్రముఖ తెలుగు నటీనటులు కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

గత నాలుగు దశబ్దాలుగా వందల సినిమాల్లో విలక్షణ పాత్రలతో ఎంతగానో మెప్పించారు కోట శ్రీనివాసరావు. అలాంటి 40 ఏళ్ల సినీ నట ప్రయాణానికి ఇవాళ కోట వీడ్కోలు చెప్పారు. విలన్‌గా, ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, హీరోలకు తండ్రిగా ఎన్నో వైవిధ్య పాత్రలతో కోట శ్రీనివాసరావు మెప్పించారు. తెలుగ...