Hyderabad, సెప్టెంబర్ 11 -- శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలను, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను అందిస్తాడు. శనిని న్యాయ దేవుడు అని కూడా అంటారు. శని సంచారము జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే, కుజ గ్రహం కూడా శక్తివంతమైన గ్రహం. ఈ రెండిటి సంయోగం కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపించనుంది. ప్రస్తుతం శని మీన రాశిలో తిరోగమనం చెందుతున్నాడు.

నవంబర్ వరకు శని ఇదే రాశిలో తిరోగమనం చెందుతాడు. ఇది ఇలా ఉంటే, కుజుడు శని సంయోగం ఏర్పడనుంది. సెప్టెంబర్ 13న కుజుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఇలా ఒక వారం తర్వాత ఈ రెండు గ్రహాలు 150 డిగ్రీల దూరంలో ఉండడంతో షడాష్టక యోగం ఏర్పడుతుంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది.

షడాష్టక యోగం అనేది శుభయోగం కాదు. కానీ ఈ మూడు రాశుల వారికి షడాష్టక యోగం మంచి ఫలిత...