భారతదేశం, జూన్ 18 -- రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్ వారికి గ్రామ వార్డు సచివాలయ శాఖ సర్వర్లు చుక్కలు చూపిస్తున్నాయి. పదేళ్ల క్రితం అమ్మేసిన ఫోర్ వీలర్ ఇప్పటికీ వారి పేరుతోనే ఉన్నట్టు చూపించడం, ఎవరిదో తెలియని కరెంటు కనెక్షన్ ఆధార్ కు ‌లింకు అయ్యి ఉందని చెప్పడం, ఎప్పుడో చేసిన వ్యాపారాలకు జిఎస్టీ రిజిస్ట్రేషన్‌, ఐటీఆర్‌ ఫైలింగ్‌ వంటి అంశాలతో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు చుక్కలు కనిపిస్తున్నాయి.

రేషన్‌ కార్డు దరఖాస్తుల్లో సాంకేతిక అభ్యంతరాలను సరిచేసుకున్నా గ్రామ వార్డు సచివాలయ శాఖ సర్వర్లలో పాత డేటా చూపించడంతో అర్హత ఉన్నా అనర్హులుగా మిగులుతున్నారు.

ఏపీలో ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఈ కార్డుల కోసం అప్లై చేసుకునేందుకు గ్రామ వార్డు సచివాలయాలకు క్యూ కడు...