Hyderabad, జూన్ 19 -- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసపెట్టి సినిమాలతో జోరు మీద ఉన్నాడు. ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో అలరించిన ప్రభాస్ స్పిరిట్ మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే, ప్రభాస్ నుంచి ఈ ఏడాది వచ్చే సినిమా ది రాజా సాబ్.

హారర్ కామెడీ జోనర్‌లో ది రాజా సాబ్ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కించారు. మొదటిసారిగా ఇలాంటి జోనర్‌‌లో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, మారుతి-ప్రభాస్ కాంబినేషన్‌లో కూడా ఇదే మొదటి సినిమా. ఇక రీసెంట్‌గా జూన్ 16న ది రాజా సాబ్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ఎప్పుడు యాక్షన్, లవర్ బాయ్, సీరియస్ రోల్స్‌లో చూసిన ప్రభాస్‌ను చాలా కాలం తర్వాత కామెడీ టైమింగ్‌తో కనిపించేసరికి అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో యూట్యూబ్‌లో ది రాజా సాబ్ మిలియన్...