Hyderabad, ఆగస్టు 28 -- రెబల్ స్టార్ ప్రభాస్ నెక్ట్స్ మూవీ ది రాజా సాబ్ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు వరుసగా నిరాశే ఎదురవుతోంది. ఈ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది డిసెంబర్ 5న వస్తుందని ఆశించినా.. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికే రానుందని ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కన్ఫమ్ చేశాడు.

ప్రభాస్ లీడ్ రోల్లో మారుతి డైరెక్ట్ చేస్తున్న ది రాజా సాబ్ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కానుంది. అంటే రెబల్ స్టార్ మరోసారి సంక్రాంతి బరిలో నిలవనున్నాడు. ఈ విషయాన్ని మూవీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ వెల్లడించాడు. మిరాయ్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు అతడు ఇలా స్పందించాడు.

ది రాజా సాబ్ మూవీ రిలీజ్ ఎప్పుడు? డిసెంబర్ 5నా లేక వచ్చే ఏడాదా అని అడిగినప్పుడు జనవరి 9నే వస్తుందని అని విశ్వప్రసాద్ అన్నాడు. షూటింగు బం...