భారతదేశం, డిసెంబర్ 25 -- రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ సంక్రాంతికి వస్తున్న విషయం తెలుసు కదా. మేకర్స్ మెల్లగా సినిమా ప్రమోషన్లను పెంచారు. తాజాగా క్రిస్మస్ సందర్భంగా రాజే యువరాజే అనే సాంగ్ ప్రోమోను అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ వచ్చింది.

ది రాజా సాబ్ మూవీ జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా క్రిస్మస్ రోజు మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

"మెర్రీ క్రిస్మస్ డార్లింగ్స్.. మా నుంచి ఓ చిన్న ఫెస్టివ్ ట్రీట్ రాజే యువరాజే ప్రోమో. 2026 సీజన్లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ ను తీసుకురాబోతోంది. అంతే" అనే క్యాప్షన్ తో మూవీ టీమ్ ట్వీట్ చేసింది.

ఈ ప్రోమో మొదట్లోనే శాంటా క్లాజ్ కు ప్రభాస్ పూజ చేస్తూ కనిపిస్తాడు. ఆ తర్వాత తన ప్రేయసిని వెతుకుతూ చర్...