భారతదేశం, నవంబర్ 4 -- అటు అభిమానులు, ఇటు సెలబ్రిటీలను ఒకే స్థాయిలో ఉర్రూతలూగించి, ఇండియన్ సినిమా దశ, దిశనే మార్చేసిన మూవీగా నిలిచింది శివ. రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్, నాగార్జున యాక్షన్ తో ఈ మూవీ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడీ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రీరిలీజ్ కానుంది. దానికి ముందు మంగళవారం (నవంబర్ 4) ట్రైలర్ రిలీజ్ చేశారు.

రామ్‌గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మూవీ శివ. 1990లో రిలీజైన ఈ మూవీని 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీరిలీజ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా.. అందులో ఈ సినిమాపై రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నాని, మణిరత్నం, చిరంజీవిలాంటి వాళ్లు తమ అభిప్రాయాలు చెప్పడం చూడొచ్చు.

శివ మూవీకి ముందు, ఆ తర్వాత అనొచ్చు అంటూ రాజమౌళి అన్నాడు. ఈ సినిమ...