Hyderabad, ఆగస్టు 13 -- ప్రపంచంలో అత్యంత అందమైన హీరోయిన్లు ఎవరు? ఈ డౌట్ మీకు కూడా వచ్చే ఉంటుంది. తాజాగా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) టాప్ 10 లిస్ట్ రిలీజ్ చేసింది. అయితే ఇందులో ఇండియా నుంచి కేవలం ఒకే ఒక్క నటి మాత్రమే చోటు దక్కించుకోవడం విశేషం. పాకిస్థాన్ కు చెందని మరో నటికి కూడా ఈ టాప్ 10లో చోటు దక్కింది.

ప్రపంచంలో అత్యంత అందమైన హీరోయిన్ల జాబితాను ఐఎండీబీ తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో వివిధ దేశాలకు చెందిన హీరోయిన్లు ఉన్నారు. అయితే ఇండియాలో ఎంతో మంది సుందరాంగులు ఉన్నా.. ఒక్కరికి మాత్రమే ఈ టాప్ 10 జాబితాలో చోటు దక్కింది. ఆమె పేరు కృతి సనన్. గతంలో ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ మూవీలో సీతగా నటించిన కృతి సనన్ ఈ లిస్టులో ఉంది.

తన అందం, ఆకర్షణ, అసాధారణ నటనకు పేరుగాంచిన నటి కృతి సనన్. ఐఎండీబీ రిలీజ్ చేసిన లిస్టులో ఏకైక ఇండియన్ హీరోయిన్ గా ఆమె...