భారతదేశం, జూన్ 22 -- ఇజ్రాయెల్​​- ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. అమెరికా, తన ప్రపంచంలోనే అత్యంత శక్తివతమైన బీ-2 బాంబర్లను ఉపయోగించి ఇరాన్​లోని 3 అణు స్థావరాలపై దాడులు చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించింది. ఫొర్డో, నతాంజ్​, ఇస్ఫహాన్​ ప్రాంతాల్లోని అణు స్థావరాలపై దాడులు విజయవంతమైనట్టు ఆయన పేర్కొన్నారు.

"ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అనే మూడు అణు స్థావరాలపై మా దాడులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు అన్ని విమానాలు ఇరాన్ గగనతలం నుంచి బయటపడ్డాయి. ప్రధాన స్థావరమైన ఫోర్డోపై పూర్తిస్థాయి బాంబుల వర్షాన్ని కురిపించాం. అన్ని విమానాలు సురక్షితంగా తమ స్థావరాలకు తిరిగి వెళుతున్నాయి," అని ట్రంప్ తన ట్రూత్​ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.

"మా గొప్ప అమెరికన్ యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే సైన్యం కూడా...