Hyderabad, అక్టోబర్ 4 -- మొట్టమొదట మనం ఏ పూజ చేసినా వినాయకుడిని ఆరాధిస్తాము. ఏదైనా వ్రతం చేసుకున్నా, పూజ చేసుకున్నా వినాయకుని ఖచ్చితంగా ఆరాధిస్తాము. పెళ్లి వంటి శుభకార్యాలలో కూడా మొట్టమొదట గణపతిని పూజిస్తాము. వినాయకుడు విఘ్నాలను తొలగించి, పనిలో విజయాన్ని దక్కేలా చూస్తాడు. కోరికలను తీర్చగల గణపతి ఆలయం గురించి మీకు తెలుసా? మన కోరికలను ఈ వినాయకుడి చెవిలో చెబితే అవి నెరవేరిపోతాయని మీకు తెలుసా?

విఘ్నాలకు అధిపతి, అగ్ర పూజలు అందుకునే వినాయకుడిని నిత్యం దేవతల సైతం ఆరాధిస్తారు. ఆయన శక్తి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వినాయకుడు అన్ని చోట్ల కొలువై ఉంటాడు, భక్తులకు అండగా నిలుస్తాడు. ఇక మరి ఈ వినాయక ఆలయం గురించి కచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఇది చాలా ప్రత్యేకమైన ఆలయం. పైగా ఇక్కడ వినాయకుడు ప్రతీ ఏటా పెరుగుతూ ఉంటాడట.

ప్రత్యేకమైన వినాయకుని ఆలయాల్ల...