Hyderabad, జూలై 7 -- మొగలి రేకులు సీరియల్‌తో హీరోగా ఎంతో పాపులర్ అయిన ఆర్కే నాయుడు చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆర్కే సాగర్ హీరోగా కమ్ బ్యాక్ ఇస్తున్న సినిమా ది 100. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్‌గా ది 100 తెరకెక్కింది.

జులై 11న థియేటర్లలో ది 100 సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ది 100 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో ఆర్కే సాగర్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెబుతూ కామెంట్స్ చేశాడు.

హీరో ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫ్యామిలీ ఫంక్షన్‌లా అనిపిస్తుంది. అంజనమ్మ (చిరంజీవి తల్లి) గారు నా సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు. వారికి ధన్యవాదాలు. మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్య నాయుడు గారు సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించారు. వారికి ధన్యవ...