భారతదేశం, నవంబర్ 4 -- కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్ గా వ్యవహరించిన ప్రకాష్ రాజ్‌కు మలయాళ బాల నటి దేవానంద జిబిన్ క్లాస్ పీకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అవార్డుల్లో బాల నటులకు ఒక్క అవార్డు కూడా ఇవ్వకపోవడం, ఆ స్థాయి సినిమాలు, నటులేవీ తమకు కనిపించలేదని ప్రకాష్ రాజ్ అనడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.

2024 ఏడాదికిగాను కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులను సోమవారం (నవంబర్ 3) అనౌన్స్ చేసిన విషయం తెలుసు కదా. ఇందులో రికార్డు స్థాయిలో ఏడోసారి మమ్ముట్టి బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఇందులో బాల నటులకుగానీ, వాళ్ల సినిమాలకు గానీ ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు. దీనిని సమర్థించుకుంటూ అలాంటి సినిమాలు, నటులు కనిపించలేదని ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చాడు.

దీనిని తప్పుబడుతూ బాలనటి దేవానంద జిబిన్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మేము మీక...