భారతదేశం, ఆగస్టు 25 -- హైదరాబాద్​లో యాపిల్​ అధికారిక రీటైల్​ స్టోర్​ కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురైంది! యాపిల్​ తన నాలుగో రీటైల్​ స్టోర్​ని పూణెలో ఓపెన్​ చేస్తున్నట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి. పూణెలోని కోపా మాల్​లో, సెప్టెంబర్​ తొలి వారంలోనే కొత్త యాపిల్​ స్టోర్​ ఓపెన్​కానుంది అని సమాచారం. ఫలితంగా ముంబై తర్వాత మహారాష్ట్రలో ఇది రెండో యాపిల్​ స్టోర్​ అవుతుంది. యాపిల్​కి దిల్లీలో ఇప్పటికే ఒక ఎక్స్​క్లూజివ్​ షోరూమ్​ ఉంది. అంతేకాదు, మూడో షోరూమ్​ని బెంగళూరులో లాంచ్​ చేస్తున్నట్టు యాపిల్​ ఇప్పటికే ధ్రువీకరించింది!

పూణె స్టోర్​ లాంచ్​కి సంబంధించిన అధికారిక తేదీని యాపిల్​ సంస్థ ప్రకటించాల్సి ఉంది. ముంబై, దిల్లీ తర్వాత.. కోల్​కతా, చెన్నై లేదా హైదరాబాద్​లో యాపిల్​ తన షోరూమ్​ని ఓపెన్​ చేసే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు...