భారతదేశం, జూలై 31 -- ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసింది. తమిళంలో థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో డబ్ అయి డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ సినిమానే 'రెడ్ శాండల్ వుడ్' (Red Sandal wood). ఈ సినిమా తెలుగు వర్షన్ తో ఇవాళ (జులై 31) ఓటీటీలో అడుగుపెట్టింది.

2023లో తమిళంలో రిలీజైన ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అక్కడ తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడీ సినిమా తెలుగు వర్షన్ ను నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ చేశారు. గురువారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

''రెడ్ శాండల్ వుడ్ ఈటీవీ విన్ లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ను ఇప్పుడే చూసేయండి'' అని ఈటీవీ విన్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఈ మూవీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేత...