Hyderabad, Oct. 26 -- ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ రైటర్, డైరెక్టర్ ఆనంద్ రవి దర్శకత్వంలో సరికొత్త కాన్సెప్ట్‌తో ఓ సినిమా తెరకెక్కింది. భోగేంద్ర గుప్త నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ 4 చిత్రానికి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను ఆదివారం నాడు అంటే ఇవాళ (అక్టోబర్ 26) లాంఛ్ చేశారు.

నెపోలియన్ రిటర్న్స్ టైటిల్ ఆనంద్ రవి, బిగ్ బాస్ దివి వాద్యా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘నెపోలియన్ రిటర్న్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆనంద్ ర‌వి రూపొందించిన నెపోలియ‌న్, ప్ర‌తినిధి, కొరమీను చిత్రాలు ఎంత పాపుల‌ర్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

తనదైన స్టైల్‌లో ఇప్పుడు ఈ యాక్ట‌ర్- డైరెక్ట‌ర్ ఆనంద్ ర‌వి మ‌రోసారి యూనిక్‌ అండ్ ఫ్రెష్ కాన్సెప్ట్‌తో నెపొలియన్ రిట‌ర్న్స్‌గా మ‌న ముందుకు రాబోతున్నారు. ‘నెపోలియన్ రిటర్న్స్’ విష‌యానికి వ‌స్తే ఆనంద్ ర...