భారతదేశం, సెప్టెంబర్ 10 -- మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ-జనరేటెడ్ పోర్న్ కంటెంట్ కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు తన పేరు, చిత్రాలను చట్టవిరుద్ధంగా ఉపయోగించకుండా నిరోధించాలని బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ఢిల్లీ హైకోర్టును కోరారు.

సెలబ్రిటీల ముఖాలు, శరీర పోలికలు, వాయిస్ వాడి ఏఐ, డీప్ ఫేక్ టెక్నాలజీతో వీడియోలు చేస్తున్నారు. కొంతమంది మరింత హద్దులు దాటి ఒకరి లైంగిక కోరికలు తీర్చడం కోసం సెలబ్రిటీల నగ్న చిత్రాలు, పోర్న్ వీడియోలను ఏఐ ఆధారంగా క్రియేట్ చేస్తున్నారు. అలా ఐశ్వర్య రాయ్ చిత్రాలు, వీడియోలు కూడా వచ్చాయి. వీటిని అడ్డుకోవాలంటూ ఐశ్వర్య రాయ్ కోర్టును ఆశ్రయించారు.

ఆమె వ్యక్తిత్వం, ప్రచార హక్కులను కాపాడుకోవడానికి ఆమె అనుమతి లేకుండా ఆమె పేరు, వాయిస్ లేదా పోలికను ఉపయోగించకుండా నిందితులను హెచ్చ...