భారతదేశం, అక్టోబర్ 4 -- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్లలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, బృందాలుగా గ్రామ, మండల స్థాయిలో విస్తృతంగా పనిచేయాలని నాయకులను, కార్యకర్తలను కోరారు.

'ప్రజాపాలనలో అన్ని వర్గాలను అక్కున చేర్చుకుని సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లలా ముందుకు సాగుతున్నాం. దశాబ్దాలుగా ఉన్న భూసమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తూ రాష్ట్రంలోని రైతులకు, సామాన్యులకు భూసమస్యల నుంచి ఊరట కలిగిస్తున్నది ప్రజా ప్రభుత్వం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తరతరాలుగా పోడ...