భారతదేశం, అక్టోబర్ 31 -- తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ గుర్తుందా? ఈ ఏడాది అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన మూవీ ఇది. సిమ్రన్ నటించిన ఈ సినిమాను డైరెక్ట్ చేసిన అభిషన్ జీవింత్ ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం (అక్టోబర్ 31) అతని పెళ్లి జరిగింది.

టూరిస్ట్ ఫ్యామిలీతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అభిషన్ జీవింత్ తన గర్ల్‌ఫ్రెండ్ అఖిలను పెళ్లి చేసుకున్నాడు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. 25 ఏళ్ల వయసులోనే అతడు ఓ ఇంటివాడు కావడం విశేషం. చాలా రోజులుగా వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు.

అంతేకాదు ఈ మధ్యే అతనికి ఓ ఖరీదైన పెళ్లి గిఫ్ట్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ నిర్మాతే ఈ గిఫ్ట్ ఇచ్చాడు. పెళ్లికి మూడు రోజుల ముందు ఓ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును అభిషన్ కు పెళ...