భారతదేశం, ఫిబ్రవరి 9 -- అమెరికా వెళ్లాలని పిచ్చితో ఊగిపోయే వారిపై సూపర్ సెటైరికల్ మూవీ వచ్చేస్తోంది. ట్రంప్ వచ్చిన తర్వాత అలాంటి వారి పరిస్థితి ఎలా మారిందో చెప్పే సినిమా ఇది. దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న ఈ లేటెస్ట్ మూవీ పేరు 'గాయపడ్డ సింహం'. కొత్త డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైజర్ (traiser) తాజాగా విడుదలైంది. అమెరికా వెళ్లాలని కలలు కనే యువకుడి ఆశలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రాబోతోంది.

'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ఇప్పుడు హీరోగానూ సత్తా చాటుతున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా 'గాయపడ్డ సింహం'. జీ స్టూడియోస్, సప్తశ్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస...