Hyderabad, జూలై 22 -- నటి నిత్యా మీనన్ తన రాబోయే రొమాంటిక్ కామెడీ మూవీ 'తలైవన్ తలైవి' ప్రమోషన్స్‌లో భాగంగా ప్రేమ, రిలేషన్‌షిప్స్, పెళ్లి గురించి నిర్మొహమాటంగా మాట్లాడింది. హార్ట్ బ్రేక్ మూమెంట్స్, ఇప్పటికీ తన సోల్ మేట్ ను కనుగొనలేకపోవడంపై తనకు ఎలాంటి బాధా లేదని స్పష్టంగా చెప్పింది. ఇంకా ఆమె ఏమన్నదో చూడండి.

'ది రమ్య షో'లో నిత్యా మీనన్ మాట్లాడుతూ.. సంవత్సరాలు గడిచేకొద్దీ ప్రేమ, సంబంధాలపై తన అభిప్రాయం ఎలా మారిందో వివరించింది. చిన్నతనంలో తన సోల్ మేట్ ని కనుగొనడం చాలా ముఖ్యమని భావించేదానని చెప్పింది. "ఏళ్లు గడిచేకొద్దీ ప్రేమ పట్ల నా అభిప్రాయం మారింది. అది నా జీవితానికి కేంద్ర బిందువు కాదు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు, నా సోల్‌మేట్‌ను కనుగొనడం నాకు చాలా ముఖ్యం అనిపించేది.

కుటుంబం, తల్లిదండ్రులు, సమాజం మిమ్మల్ని అది అనివార్యం అని నమ్మేలా చేస్తా...