భారతదేశం, మే 20 -- మనం ప్రతిరోజు పూజ చేసి మనకు తోచిన వాటిని నైవేద్యంగా పెడుతూ ఉంటాం. బెల్లం ముక్క, అరటిపండ్లు, పరమాన్నం ఇలా ఎవరికి తోచిన వాటిని వారు స్వామివారికి నైవేద్యంగా పెడుతుంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడితే అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. "అదేంటి, పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడితే లాభాలా?" అని ఆలోచిస్తున్నారా?

కులదైవాలకు పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడితే అప్పులు తొలగి పోతాయి. శత్రు బాధలు తొలగిపోవాలంటే ఇందులో కొన్ని దానిమ్మ గింజలను కూడా కలిపి పెట్టండి. శత్రు బాధల నుంచి బయటపడవచ్చు. తేజస్సు కూడా పెరుగుతుంది. పెరుగన్నంలో ఖర్జూరాన్ని కలిపి దానం ఇవ్వడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.

ఏ విధమైన డబ్బు సమస్యలైనా సరే తొలగిపోతాయి. పెరుగన్నంలో ఉప్పు, మిరపకాయ కలిపి నైవేద్యం పెట్టినట్లయితే రోగాలు, గ...