Hyderabad, జూన్ 6 -- ప్రముఖ తెలుగు సినిమా నిర్మాతల్లో ఒకరు బన్నీ వాస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దగ్గరి వాడు. అలాంటి నిర్మాత ఇప్పుడు తన ఎక్స్ అకౌంట్లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అటు ఎగ్జిబిటర్లు, ఇటు ప్రొడ్యూసర్లకు కీలకమైన సూచన చేశాడు. వాటాల సంగతి తర్వాత.. ముందు ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చే మార్గం ఆలోచించండని అనడం గమనార్హం.

కొన్నాళ్లుగా ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్ల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలుసు కదా. లాభాల్లో పర్సెంటేజీ కోసం ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. ఇదే విషయమై జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉంటుందన్న వార్తలూ వచ్చాయి.

అది కాస్తా తీవ్ర రూపం దాల్చి.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వరకూ వెళ్లింది. అయితే ఈ అంశంపై తాజాగా ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్పందించాడు. తన ఎక్స్ అకౌంట్లో శుక్రవారం (జూన్ 6) ఓ పోస్ట్ చేశాడు. అందులో...