భారతదేశం, జూలై 28 -- మిడ్​ రేంజ్​, కెమెరా ఓరియెంటెడ్​ స్మార్ట్​ఫోన్​ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఇటీవలే లాంచ్​ అయిన రియల్​మీ 15 ప్రో 5జీని మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉన్న వివో వీ50 5జీతో పోల్చి, ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రియల్‌మీ 15 ప్రో 5జీ డిజైన్ వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ సన్నని, తేలికపాటి నిర్మాణంతో వస్తుంది. దీని మందం 7.69ఎంఎం, బరువు 187 గ్రాములు. ఇది స్క్వేర్ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అంతేకాకుండా ఇది వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​ కోసం ఐపీ69 రేటింగ్‌తో మన్నికను అందిస్తుంది.

మరోవైపు వివో వీ50 కూడా 7.7ఎంఎం థిక్​నెస్​, 189 గ్రాముల బరువుతో నాజూకైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో నిలువుగా అమర్చిన పిల్-ఆకారపు కెమెర...