భారతదేశం, ఫిబ్రవరి 15 -- సినీ లవర్స్, మెగా ఫ్యాన్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తున్న తెలుగు సినిమా పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ రోజు పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సాన బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఓ సర్ ప్రైజ్ ఇచ్చింది. పెద్ది షూటింగ్ లో బుచ్చిబాబు ఎలా కష్టపడుతున్నారో చూపించే బీటీఎస్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాకు బుచ్చిబాబు సాన డైరెక్టర్. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సాన.. ఉప్పెన సినిమాతో డెబ్యూ చేశాడు. ఇప్పుడు తన సెకండ్ మూవీనే రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇవాళ (ఫిబ్రవరి 15) బుచ్చిబాబు బర్త్ డే. ఈ సందర్భంగా పెద్ది బీటీఎస్ వీడియో రిలీజ్ చేశారు. మూవీ సెట్స్ లో, షూటింగ్ లో బుచ్...