భారతదేశం, జూలై 8 -- జగన్నాథ రథయాత్ర సందర్భంగా పూరి క్షేత్రం భక్తకోటితో కిటకిటలాడుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఆలయ నిర్మాణం, అందులోని నాలుగు దివ్య ద్వారాలు, 22 మెట్ల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది.

ప్రపంచ ప్రసిద్ధ పూరి జగన్నాథ రథయాత్ర 2026 జూలై 16న ప్రారంభమైన విషయం తెలిసిందే. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిని దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఒడిశాకు తరలివచ్చారు. స్వామివారిని రథాలపై చూడడం ఒక ఎత్తు అయితే, జగన్నాథుని ఆలయంలో అడుగుపెట్టి ఆ పరమాత్మను స్మరించుకోవడం ఇంకో ఎత్తు. ఎన్నో శతాబ్దాల చరిత్ర, అందుచిక్కని రహస్యాలు ఈ ఆలయ నిర్మాణంలో ఉన్నాయి. దీని వెనుక గొప్ప ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయని మీకు తెలుసా?

జగన్నాథుని ఆలయంలో నాలుగు దిక్కులా నాలుగు ప్రధాన ద్వారాలు ఉంటాయి. వీటిని సిం...