భారతదేశం, జూన్ 21 -- హిందూ ధర్మంలో పూజా కార్యక్రమాల్లో గంటానాదం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తిశ్రద్ధలతో దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు గంటను మ్రోగించడం మనందరికీ అలవాటు. కానీ, ఈ గంటానాదం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? దీన్ని ఏ పద్ధతిలో మ్రోగిస్తే పూజా ఫలితం దక్కుతుంది? అనే విషయాలపై స్పష్టత అవసరం.

గంట శబ్దం మనసును ఏకాగ్రం చేస్తుంది. పూజ చేస్తున్నప్పుడు చంచలమైన మనసు అటు ఇటు తిరుగుతుంటుంది. అటువంటి సమయంలో గంటానాదం వినిపించగానే, భక్తుడి దృష్టి పూర్తిగా దైవంపైకి మళ్ళుతుంది. శాస్త్రాల ప్రకారం, గంట శబ్దం మన అంతరాత్మను మేల్కొలిపి, దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది. అంతేకాకుండా, గంట నుండి వెలువడే తరంగాలు ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమికొట్టి, సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తాయి.

చాలా మంది గంటను ...