Hyderabad, ఆగస్టు 28 -- ప్రతి ఒక్కరూ కూడా రోజూ ఇంట్లో పూజ చేస్తారు. కచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో రోజూ దీపారాధన చేయాలి. వాస్తు శాస్త్రం ప్రకారం పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే కొలువై ఉంటుంది. కనుక ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దాంతో పాటు ఇంటి పూజ గది కూడా శుభ్రంగా ఉండాలి.

పూజ గది శుభ్రంగా లేకపోతే చాలా రకాల సమస్యలు వస్తాయి. ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి. చాలా మంది పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాంతో ఆర్థిక నష్టంతో పాటు పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? ఎలాంటి పొరపాట్లు చేయడం వలన నష్టాలు ఎదుర్...