Hyderabad, అక్టోబర్ 6 -- చాలామంది పూజ మందిరాన్ని అందంగా అలంకరించుకునేందుకు రకరకాల దేవుడు పటాలను పెడుతూ ఉంటారు. ఎవరైనా దేవుడు పటాలను బహుమతిగా ఇచ్చినప్పుడు లేదా స్వయంగా మనమే ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఫోటోలను కొనుగోలు చేయడం.. ఇలా వివిధ కారణాల వలన దేవుడి మందిరంలో ఫోటోలు ఎక్కువైపోతూ ఉంటాయి.

పూజ గదిలో ఫోటోలు ఎక్కువ అయిపోతే ఏం చేయాలి? ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఇంట్లో పూజ గది స్టోర్‌రూమ్‌లా అయిపోతుంది. 50, 100 ఫోటోలు వరకు ఉంటాయి. చాలా మందికి ఇది అలవాటే. అయితే పూజ మందిరంలో దేవుడి ఫోటోలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూజ మందిరంలో దేవుడు ఫోటోలు ఎక్కువ అయిపోతే వాటిని తీసేస్తూ ఉండాలి. పడకగదిలో దేవుడు ఫోటోలు ఉండకూడదు, హాల్లో దేవుడు ఫోటోలు ఉండకూడదు. చాలా మంది అన్ని ఫోటోలను పూజ గదిలో పెట్టేస్తూ ఉంటారు. అన్ని...