భారతదేశం, మార్చి 20 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప 2' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి భారీ సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించిన ఒక నటి మాత్రం తన పాత్ర విషయంలో చాలా నిరాశకు గురైంది. బిగ్‌బాస్ ఫేమ్, యంగ్ బ్యూటీ దివి వాద్యా ఈ సినిమాలో ఒక రిపోర్టర్ తరహా పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ కట్‌లో తన పాత్రను బాగా తగ్గించేయడం పట్ల ఆమె ఓపెన్‌గా తన ఆవేదనను బయటపెట్టింది. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో దివి తాజాగా దీనిపై స్పందించింది.

పుష్ప 2 సినిమాలో తన క్యారెక్టర్ గురించి దివి మాట్లాడుతూ.. "మొదట నాకు కథ చెప్పినప్పుడు నా పాత్ర చాలా పెద్దది అని చెప్పారు. నా క్యారెక్టర్‌కు సంబంధించి ఒక స్పెషల్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అది చూసి నేను కూడా నాది నిజంగానే సినిమాలో...