భారతదేశం, ఆగస్టు 21 -- పుత్రదా ఏకాదశి నాడు విష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏడాది పుత్రదా ఏకాదశి ఆగస్టు 23న వచ్చింది. ఆ రోజు విష్ణువుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే పుత్రదా ఏకాదశి నాడు ఎలా విష్ణువుని పూజించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా విష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. అద్భుతమైన లాభాలను చూడొచ్చు.

శ్రావణ పుత్రదా ఏకాదశి ఆగస్టు 23 ఉదయం 2:00 గంటలకు మొదలవుతుంది. ఆగస్టు 24 ఉదయం 4:18 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి అనుకూలంగా ఉంటుంది.

స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత విష్ణువు ఎదుట దీపారాధన చేసి, పసుపు రంగు పూలను, పండ్లను సమర్పించాలి. తులసి ఆకులను కూడా విష్ణువుని పూజించడానికి ఖచ్చితంగా ఉపయోగించాలి. ఉపవాసం ఉండి, విష్ణు మంత్రా...